నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని అల్లరి పిల్ల ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన “నువ్వు నాకు నచ్చావ్” అనే చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్ మరియు స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అల్లరి పిల్ల పింకీ సుదీప కూడా ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.

 Nuvvu Naku Nachav Movie Fame Child Artist Pinky Sudeepa Real Life News, Pinky Su-TeluguStop.com

అయితే పింకీ సుదీప చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో నటించింది.

అయితే పింకీ సుదీపఆ మధ్య పైచదువుల కోసం కొంత కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది.

 ఈ క్రమంలో క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంది.అంతేగాక పింకీ సుదీప తల్లిదండ్రులు కూడా క్లాసికల్ డాన్సర్స్ కావడంతో వీరికి సొంతంగా ఓ డాన్స్ అకాడమీ కూడా ఉంది.

 అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సినీ కెరీర్ ని మొదలు పెట్టినటువంటి పింకీ సుదీప ఆశించిన స్థాయిలో నటిగా రాణించలేక పోయింది. దీంతో శ్రీ రంగనాథ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన తర్వాత కూడా పింకీ సుదీప పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించింది.

అయితే ప్రస్తుతం పింకీ సుదీప తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

కాగా తెలుగులో పింకీ సుదీప నటించిన 7/జి బృందావన్ కాలనీ, నువ్వు నాకు నచ్చావ్, నీ స్నేహం,  మిస్టర్ పర్ఫెక్ట్, బిందాస్ తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.అంతేగాక అమ్మడికి మంచి గుర్తింపును కూడా తెచ్చాయి.

అయితే ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ప్రతి ఘటన అనే సీరియల్ లో కూడా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube