సమ్మర్‌ బెర్త్‌ లను ముందే కన్ఫర్మ్‌ చేసుకుంటున్న యంగ్‌ హీరోలు

టాలీవుడ్‌ లో గత ఏడాది సమ్మర్ కు విడుదల అవ్వాల్సిన సినిమాల నుండి మొదలుకుని పదుల సంఖ్యలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు ఉన్నాయి.

విడుదల కోసం వెయిట్‌ చేస్తున్న సినిమాలు సంక్రాంతికి తీసుకు రావాలనుకుంటే థియేటర్లు ఇప్పుడిప్పుడే ఓపెన్‌ అవుతున్నాయి.

అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే ఓపెన్‌ గా ఉన్నాయి.కనుక ఈ సమయంలో విడుదల చేయడం వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం అంటూ సినిమా విడుదల విషయంలో ఆలస్యం చేస్తున్నారు.

ఈ సమయంలోనే సమ్మర్‌ పై యంగ్‌ హీరోల సీనియర్‌ హీరోలు దృష్టి పెట్టారు.ఎలాగూ సీనియర్‌ హీరోలు సమ్మర్ లో క్యూ కట్టే అవకాశం ఉంది.

కనుక తమ సినిమాలకు ఇప్పుడే డేట్లు ఖరారు చేస్తే వాటిని ఎవరు కదిలించరు కదా అనే ఉద్దేశ్యంతో యంగ్‌ హీరోలు కొందరు విడుదలకు ఇంనా మూడు నాలుగు నెలలు సమయం ఉండగానే డేట్లు చెబుతున్నారు.ముందే డేట్ ను అనుకున్నాం కనుక మేము తప్పుకోము అనేందుకు వీలు ఉంటుంది.

Advertisement

థియేటర్ల పరిస్థితి అప్పటి వరకు ఎలా ఉంటుందో చూసి విడుదల విషయమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.మొత్తానికి ఏప్రిల్‌ నెలలో తమ సినిమాలను తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అరడజను మంది చిన్న యంగ్‌ హీరోలు చెప్పుకొచ్చారు.

దాంతో పెద్ద సినిమాల విషయంలో ఏం జరుగబోతుంది అనేది ప్రస్తుతం చర్చ నీయాంశంగా ఉంది.పెద్ద సినిమాలు విడుదల తేదీ విషయంలో చిన్న సినిమాలతో పోటీ పడితే సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

కనుక వచ్చే జూన్‌ జులై వరకు పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదా అనిపించేలా చిన్న సినిమాలు వరుసగా తమ సినిమాల తేదీలను సమ్మర్ కు ఫిక్స్ చేసుకుంటున్నాయి.ఉప్పెన నుండి మొదలుకుని ఇంకా పూర్తి కాని టక్ జగదీష్‌ వరకు మార్చి ఏప్రిల్‌ లో విడుదలకు సిద్దం అవుతున్నాయి.

వీటి ఫలితం ఏంటీ అనేది సమ్మర్‌ వస్తే కాని క్లారిటీ రాదు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు