RRR హీరోలను పంచుకున్న స్టార్లు

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయంటే ఇక ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

తమ అభిమాన హీరో సినిమా హిట్ అవుతుందంటూ ఎవరికి వారు పోటీ పడుతుంటారు.

కాగా ఈ సంక్రాంతి బరిలో పందెం కోళ్లలా పోటీ పడుతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్‌లో ఎవరు గెలుస్తారా అని ఆతృతగా చూసతున్నారు జనం.కాగా వీరిద్దరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలను పంచుకున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను సంప్రదించి, వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

అయితే వారిలో ఎవరు ఈవెంట్‌కు వస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.కాగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బన్నీ తారక్‌ను ఆహ్వానించాడట.

దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలను ఇద్దరు స్టార్ హీరోలు పంచుకున్నారంటూ సినీ జనం అనుకుంటున్నారు.ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఎలాంటి క్రేజ్‌ను సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Advertisement
సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!

తాజా వార్తలు