ఎన్టీఆర్ నోరు విప్పడేంటి..!

రీసెంట్ గా కొల్లార్ లో ఎన్టీఆర్ అభిమాని అక్షయ్ కుమార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ ని కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి వినోద్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సఘటన ఎలా జరిగిందన్న వివరాలు తెలుసుకున్నారు.

అయితే ఈ విషయంలో ఎవరిది తప్పు, అక్కడ జరిగిన వివాదం ఏంటి అన్న తీరున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ అభిమాని అక్షయ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది.

అయితే నిన్న మొత్తం హాట్ న్యూస్ అయిన ఈ విషయంపై జూనియర్ నోరు మెదపకపోవడం ఆశ్చర్యంగా ఉంది.హత్య చేసింది ఎన్టీఆర్ అభిమానే అని తెలిసినా కొన్ని మీడియా వర్గాలు అది దాచే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ విషయం తెలిసిన జూనియర్ కూడా చాలా బాధ పడ్డాడట కాని తనలో బాధ పడి ఏం లాభం బయట ఫ్యాన్స్ కు ఓ సందేశం ఇస్తేనే రెస్పాన్స్ అయినట్టు తెలుస్తుంది.మరి నేడో రేపో ఎన్టీఆర్ ఈ విషయంపై మాట్లాడుతారని అంటున్నారు.

Advertisement

ఇక తారక్ నటించిన జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు