ఎన్టీఆర్‌ బర్త్‌డేకు రాజమౌళి ఇచ్చే గిఫ్ట్‌ అదేనా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మే 20వ తారీకున తన పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే.

ఈ సందర్బంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ వచ్చే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఆమద్య ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రెస్‌మీట్‌లో ఇప్పట్లో ఫస్ట్‌లుక్‌లు ఇచ్చే ఉద్దేశ్యం ఏమీ లేదని, వచ్చే ఏడాది వరకు సినిమా గురించి ఎలాంటి పోస్టర్‌లు విడుదల చేయబోవడం లేదు అంటూ రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌ లుక్‌ రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ ప్రీ లుక్‌ను విడుదల చేసి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజమౌళి సిద్దం అయ్యాడని, అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అయితే ఇప్పటి వరకు అలాంటి క్లారిటీ ఏమీ కూడా రాలేదు.

కాని రాజమౌళి సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు కానుక ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుండి ఉండబోతుందని చెబుతున్నారు.అయితే అది ఏంటీ అనే విషయంపై వారు క్లారిటీ ఇవ్వడం లేదు.

Advertisement

ఇటీవలే జరిగిన రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్బంగా ఎలాంటి ఫస్ట్‌లుక్‌ను ఇవ్వలేదు.కాని ఈసారి మాత్రం రాజమౌళి ఎన్టీఆర్‌ కోసం బర్త్‌డే గిఫ్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్‌ బర్త్‌డే కు రిలీజ్‌ చేసేందుకు ప్రీ లుక్‌ ఒకటి రెడీ చేశారు.

అందులో ఎన్టీఆర్‌ కు సంబంధించిన గెటప్‌ ఎలా ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా కేవలం ఆయన ఫేస్‌లోని ఏదైనా భాగంను ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.వచ్చే ఏడాది జులైలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు