'ఏబీసీడీ' కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటీ?

అల్లు శిరీష్‌ హీరోగా వచ్చిన ఏబీసీడీ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది.మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఏబీసీడీ చిత్రంను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్‌ చేయడం జరిగింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన తెలుగు ఏబీసీడీకి మొదటి రోజు 2.25 కోట్ల గ్రాస్‌ దక్కింది.మెగా మూవీకి ఈ కలెక్షన్స్‌ చాలా అంటే చాలా తక్కువ.

కోటి రూపాయల షేర్‌తో ఈ చిత్రం లాంగ్‌ రన్‌ లో నిరాశ పర్చడం ఖాయంగా సినీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని సినీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది.

మహర్షి ఒక వైపు వసూళ్లు భారీగా రాబడుతున్న ఈ సమయంలో ఏబీసీడీ చిత్రం విడుదలైంది.మహర్షి పోటీని ఈ చిత్రం తట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలోనే అల్లు శిరీష్‌ బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏబీసీడీ చిత్రం 10 కోట్ల రూపాయల షేర్‌ను రాబడితేనే బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకుంటుందని అంటున్నారు.

Advertisement

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏబీసీడీ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.అయితే మెగా బ్రాండ్‌ ఏమైనా వర్కౌట్‌ అయ్యి బయ్యర్లను బయట పడేస్తుందో చూడాలి.పెద్ద ఎత్తున ఈ చిత్రంపై అంచనాలున్న నేపథ్యంలో బయ్యర్లు మీద మీద పడి భారీగా పెట్టి కొనుగోలు చేయడం జరిగింది.

నిర్మాతలు ఇప్పటికే సేఫ్‌ అయినా కూడా బయ్యర్లు మాత్రం కష్టంగానే ఉంది పరిస్థితి.

Advertisement

తాజా వార్తలు