ఆ సినిమా టైం లో జూనియర్ ఎన్టీఆర్ నాతో ఆడుకున్నాడు...

కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కొడుకు అయిన రాజమౌళి కెరియర్ మొదట్లో వాళ్ళ నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా కొన్ని సినిమాలకి చేసాడు అలాగే దాని తర్వాత రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

అయితే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గా రాజమౌళి కి స్టూడెంట్ నెంబర్1 సినిమా తీసే అవకాశం వచ్చింది.

ఈ సినిమా లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేశాడు అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర లో నటుడు రాజీవ్ కనకాల నటించాడు.ఈ సినిమా టైం లో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాలని టీజ్ చేస్తూ చాలా అటపట్టించే వాడని రాజీవ్ కనకాల చాలా సందర్భాల్లో చెప్పాడు.

షూటింగ్ టైం లో వీళ్ళిద్దరూ పెట్టుకునే చిన్నపాటి గిల్లిగజ్జలను ఆపడానికి రాజమౌళి కి తలప్రాణం తోకకి వచ్చేదట కొన్నిసర్లయితే ఎన్టీఆర్ చేసే టీజింగ్ కి రాజీవ్ కి షూటింగ్ నుంచి వెళ్లిపోవాలి అనిపించేదట కానీ మళ్ళీ అన్ని వదిలేసి షూటింగ్ చేసేవాడట.

ఒక రోజు అయితే అరేయ్ రాజీవ్ ఇలా రారా అని పిలిచి బాగా అటపట్టించాడట తర్వాత ఎన్టీయార్ ఇదంతా ఊరికే జోక్ గా అంటున్న ఇవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పడం తో ఇక అప్పటి నుండి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట.అప్పుడు జరిగిన చిన్న చిన్న గొడవల వల్లే ఒకరి గురించి ఒకరికి తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూనే ఉన్నాం అని చెపుతునే తారక్ ఇప్పటికీ కూడా ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు అందుకే నాకు తారక్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు.

Advertisement

అలాగే ఎన్టీయార్ కి కూడా రాజీవ్ అంటే చాలా ఇష్టం అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీయార్ చేసిన చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల కూడా ఉండే విధంగా చూసుకుంటూ వచ్చాడు.మొత్తానికి మొదట తన చిలిపి చేష్టలతో రాజీవ్ కి కోపం తెప్పించిన తారక్ తర్వాత కాలం లో రాజీవ్ కి బెస్ట్ ఫ్రెండ్ గా మారాడు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు