కొరటాల వెయిటింగ్‌.. ఎన్టీఆర్ దే ఆలస్యం అంటున్నారు

ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగించిన రామ్ చరణ్‌ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టాడు.

ఆ సినిమా పూణె లో జోరుగా చిత్రీకరన జరుపుకుంటోంది.

శంకర్ దర్శకత్వంలో చరణ్‌ మూవీ ప్రారంభం అయిన ఈ సమయంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ తదుపరి సినిమా పట్టాలెక్కక పోవడం పై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా మొదలు కావాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూనే ఉంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లు రెండు ఒకే సారి పట్టాలెక్కాల్సి ఉంది.

కాని శంకర్‌ చరణ్‌ ల మూవీ పట్టాలెక్కినా ఎన్టీఆర్ 30 మాత్రం ఇంకా స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సాగుతోంది.ఆచార్య సినిమా ను ముగించిన కొరటాల శివ తదుపరి సినిమా ను ఎన్టీఆర్ తో చేసేందుకు ఇప్పటికే కమిట్‌ అయ్యి కథను సిద్దం చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ముగించాడు.

Advertisement

కాని ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నుండి కావాల్సినది రాలేదట.అదే ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం పది కేజీల వరకు బరువు తగ్గాలనుకున్నాడు.

బరువు తగ్గిన తర్వాత మాత్రమే సినిమాను చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట.

అందుకే బరువు తగ్గే పనిలో ఉన్నాడు.బరువు తగ్గిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న కొరటాల మరియు ఎన్టీఆర్ ల సినిమా ను ఎప్పుడు మొదలు పెట్టినా కూడా వచ్చే సమ్మర్ చివర్లో లేదా వచ్చే ఏడాది దసరాకు అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

అతి త్వరలోనే ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు