ఆలస్యమైన కాలర్ ఎగరేద్దాం... దేవరపై అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్?

ఆర్ఆర్ఆర్( RRR ) తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) నటిస్తున్నటువంటి చిత్రం దేవర( Devara ) .

ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు.కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

అయితే మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీ విడుదల కాబోతోంది.

ఏప్రిల్ 5వ తేదీ రావాల్సిన ఈ సినిమా కాస్త వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఎన్టీఆర్ దేవర అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపారు.తాజాగా ఎన్టీఆర్ సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) హీరోగా నటించిన టిల్లు స్క్వేర్( Tillu Square ) సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

Advertisement

హైదరాబాదులో జరిగిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.దేవర సినిమా మొత్తం ఎక్కువగా భయం అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని తెలిపారు.ఈ సినిమాలో ఎక్కువ భాగం భయం గురించే మాట్లాడుతూ ఉంటాము.

ఓవర్ అయిందని మీరు అనుకోకపోతే ఒక చిన్న విషయం చెబుతా ఈ సినిమా విడుదల కావడం ఆలస్యమైనా కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుంది.అంతలా ఈ సినిమా కోసం కష్టపడుతున్నామంటూ  ఎన్టీఆర్ దేవర సినిమా గురించి చెప్పడంతో అభిమానులలో ఎంతో ఉత్సాహం కనిపించింది.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు