సీమాంధ్ర రాజధానిలో కలకలం రేగింది.అనుకోని కారణాల వల్ల ఒక ప్రవాస భారతీయుడు(ఎన్.
ఆర్.ఐ) అనుమానాస్పదంగా మరణించాడు.ఈ నెల 10వ తేదీన శ్రీరాం అనే ఎన్.ఆర్.ఐ లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక దీనిపై అతని భార్య మాట్లాడుతూ.
తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆస్తి కోసం అత్తింటి వారే ఆయన్ను చంపేశారని శ్రీరామ్ భార్య అనిల ఆరోపిస్తున్నారు.వందల కోట్లు ఆస్తులు తమకున్నాయని, అత్తింటి వారు శ్రీరామ్‌తో గతంలోనే డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారని అనిల ఆరోపించారు.
తన భర్త అనుమానాస్పద మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.మరి దీనిలో రాజకీయ ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా అన్న కోణం సైతం కనిపిస్తుంది అని గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా దీనిపై పోలీసులు విచారణ జరపి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.







