జగన్ అడ్డాలో టీడీపీ జెండా!!

రాష్ట్ర రాజకీయాల్లో ఆయా పార్టీల పరిస్థితుల బట్టి నియోజకవర్గాలో గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాఈ.అయితే ఏవి ఎలా ఉన్నా కొన్ని కొన్ని నియోజక వర్గాల్లో రాష్ట్రమంతటా ఏ గాలి వీచినా.

 Tdp Master Plan In Pulivendula-TeluguStop.com

అక్కడ ఫలితాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.అలాంటి వాటిలో ముఖ్యనేతల సొంత నియోజకవర్గాలే ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు పులివెందుల, కుప్పం వంటివి.అయితే కుప్పం బాబుకి, టీడీపీకి కంచుకోట కాగా….

ఇక పులివెందుల వైఎస్ కుటుంబానికి అడ్డాగా చెప్పుకోవచ్చు.ఇదిలా ఉంటే.

ఆ వైఎస్ అడ్దాకే బీటలు పడే అవకాశం ఉందంటుంది తెలుగుదేశం పార్టీ.దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి.

విషయం ఏమిటంటే…పులివెందుల పులిబిడ్డగా పేరున్న జగన్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసే ఉపాయం ఒకటి తనదగ్గరుందంటున్నాడో రాయలసీమ నేత.ఆయనే జేసీ దివాకర్ రెడ్డి.గండికోట కాలువ పనులు సకాలంలో పూర్తి చేసి.పులివెందుల ప్రాంతానికి నీటి కొరత లేకుండా చేస్తే.జనం పులివెందులలో టీడీపీని గెలిపించడం ఖాయమని జోస్యం చెప్పేశాడాయన.చంద్రబాబు సర్కారు చిత్రావతి నుంచి తాజాగా పులివెందుల ప్రాంతానికి ఒకటిన్నర టీఎంసీల నీరు వదిలింది.

దీంతో ఎండిపోతాయనుకున్న చినీ తోటలు మళ్లీ జీవకళ సంతరించుకున్నాయట.ఆ కృతజ్ఞత చెప్పుకునేందుకు పులివెందులకు చెందిన రైతులు కొందరు చంద్రబాబును కలిసేందుకు వచ్చారు.

అప్పుడు వారికి అభయమిచ్చిన బాబు.ముందు.

పులివెందులకు నీరిచ్చాకే.తన కుప్పం సంగతి ఆలోచిస్తాననని హామీ ఇచ్చాడట.

మరి ఇక బాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తే వైఎస్ అడ్డా కాస్తా.తెలుగుదేశానికి దాసోహం అంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube