మహేష్ సినిమాలో తమ్మూ డ్యాన్స్.. నమ్మితే అంతే!  

No Tamanna Item In Sarileru Neekevvaru-mahesh Babu,sarileru Neekevvaru,tamanna

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పార్ట్ పూర్తయింది.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ఓ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడని మనకు ఫస్ట్ టీజర్‌తోనే చెప్పేశారు చిత్ర యూనిట్.

No Tamanna Item In Sarileru Neekevvaru-mahesh Babu,sarileru Neekevvaru,tamanna-No Tamanna Item Song In Sarileru Neekevvaru-Mahesh Babu Sarileru Neekevvaru

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ రష్మిక మందన నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఎప్పటిలాగే మహేష్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.అది మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తోందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

దీంతో తమన్నా ఐటెం సాంగ్ అంటే ఈ సినిమాకు మరింత బూస్ట్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి.ఇప్పటికే ఈ విషయంపై తమన్నాను చిత్ర యూనిట్ సంప్రదించిందంటూ వార్తలు కూడా వచ్చాయి.

కానీ అవన్నీ కేవలం గాలివార్తలే అని తేలిపోయింది.తమన్నాను ఈ సినిమాకు సంబంధించి ఎవరూ సంప్రదింపులు జరపలేదని ఆమె తేల్చి చెప్పేయడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లే అయ్యింది.మరి ఈ సినిమాలో నిజంగానే ఐటెం సాంగ్ ఉంటే అందులో ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.