ఎవరి వెనుకా లేం -మేమే ముందు ఉన్నాం :జీవిఎల్

ఎన్నికల సంవత్సరం లోకి వచ్చినందున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ( AP Politics ) సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

నిన్నటి వరకు మిత్రులు అనుకున్న వారు నేడు కత్తులు దూస్తున్నారు.

పొత్తు కుదరదు అనుకున్న పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి.బిజెపి ( BJP )ఇకపై మాకు అండగా ఉండదంటూ వైసిపి ( YCP )చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇంతవరకూ మా వెనక బిజెపి ఉందన్న సంకేతాలు ఆ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

అయితే తాము ఎవరికీ అండగా ఉండబోమని ,ఎవరి పల్లకీ మోయాల్సిన అవసరంతమకు లేదని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లాగా ఎదగబోతున్నామన్న సంకేతాలను బిజెపి నేత జివిఎల్ నరసింహారావు( BJP leader GVL Narasimha Rao ) ఇచ్చారు.ఎవరి వెనుకా ఉండం, మేమే ముందు ఉన్నామన్నారు .రాష్ట్ర వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తున్న నేతలు అసలు రాష్ట్రానికి తాము చేస్తున్న మేలు ఏదో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు .అమిత్షా చేసిన వ్యాఖ్యల లో నిజం లేకపోతే సిబిఐ ఎంక్వయిరీ చేయాల్సిందిగా డిమాండ్ చేయవచ్చు కదా అంటూ ఆయన నిలదీశారు.ప్రజల కోసం మాత్రమే కొన్ని విషయాలలో మద్దతు ఇచ్చాము తప్ప ఏ పార్టీని వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదని తాము స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అంతవరకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ బాధ్యతను నెరవేరుస్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

వైసిపి కో తెలుగుదేశం పార్టీ కో ఊడిగం చేయాల్సిన అవశరం తమకు లేదని ,ప్రజాక్షేమం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు .పొత్తులతోనే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ముందుకు నడుస్తాయని అంచనాలు ఉన్నపటికీ ఆ పొత్తులు ఏ పార్టీల మధ్య ఉంటాయన్న సందిగ్ధం ప్రస్తుతానికి ఇంకా అలానే ఉంది.ప్రాథమికంగా తెలుగుదేశం జనసేన పొత్తులు కన్ఫామ్ అయినప్పటికీ సీట్ల తకరారు ఆ పార్టీల మధ్య తేలడం లేదు.

Advertisement

ఎవరికి వారు తామే అభ్యర్థులం అని ప్రకటించుకోవడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు చాలా జటిలం గా మారిపోతున్నాయని తెలుస్తుంది.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు