ఎంపీ వ‌ద్దు.. ఎమ్మెల్యే కావాలంటున్న 10మంది ఎంపీలు..!

తెలంగాణ‌లో ఇప్పుడు స‌రికొత్త రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి.ఎన్నిక‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చాలామంది నేత‌లు త‌మ రూట్ల‌ను మార్చేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉన్న వారంతా కూడా రాబోయే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారంట‌.ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఒక క‌చ్చిత‌మైన నియోజ‌క‌వ‌ర్గం అంటూ ఏమీ ఉండ‌దు.

కాబ‌ట్టి ఎమ్మెల్యే అయితే చెప్పుకోవ‌డానికి ఒక ప్రాంతీయ‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఉంటుంద‌ని భావిస్తున్నారు.కాబ‌ట్టి టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ లోని చాలామంది ఎంపీలు ఇదే బాట ప‌డుతున్నారు.

బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రాబోయే ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి లేదంటే వేముల వాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.ఇక అరవింద్ కూడా ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement

ఇక కేంద్ర‌మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన అంబర్‌పేట మీద దృష్టి పెడుతుతున్నారు.ఇక ఎంపీ సోయం బాపురావు కూడా బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కావాల‌ని చూస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన నామా నాగేశ్వర్ రావు కూడా ఎమ్మెల్యే కావాల‌ని చూస్తున్నారంట‌.

మ‌రో ఎంపీ మాలోతు కవిత కూడా తన తండ్రి నియోజకవర్గం డోర్నకల్ లో ఎమ్మెల్యే కావాల‌ని భావిస్తున్నారు. ఎంపీ రంజీత్ రెడ్డి కూడా రాజేంద్ర నగర్ మీద ఫోక‌స్ పెడుతున్నారు.కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డి వెంటకరెడ్డి, రేవంత్ కూడా తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌ని భావిస్తున్న విష‌యం తెలిసిందే.

వీరంతా స్టేట్‌కే ప‌రిమితం కావాల‌ని చూస్తున్నారు.అప్పుడే త‌మ ప‌ట్టు నిలుస్తుంద‌ని భావిస్తున్నారంట‌.మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో వీరి క‌ల నిజ‌మౌతుందా లేదా అనేది తెలియాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల దాకా అయితే వేచి చూడాలి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఏదేమైనా తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత మార్పు చెంద‌బోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు