పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు..: గిడుగు రుద్రరాజు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీసీసీ నేతలు కలిశారు.ఈ క్రమంలో రాష్ట్రంలో కరవు పరిస్థితులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై వినతిపత్రం అందజేశారు.

గవర్నర్ కు వినతిపత్రం అందించిన అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కరవు కాటాకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందన లేదని చెప్పారు.నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

తెలంగాణతో నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు.అనంతరం పొత్తులపై మాట్లాడిన ఆయన ఏపీలో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు