నితిన్ 'కిక్' ఎక్కిస్తాడట..!

లవర్ బోయ్ నితిన్ ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు.

సినిమాలో నితిన్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.ఈ సినిమా తర్వాత రైటర్ కమ్ డైరక్టర్ వక్కంతం వంశీ డైరక్షన్ లో నితిన్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే.

Nitin Vakkamtham Vamsy Movie Another Kick Nitin, Vakkamtham Vamsy , Macherla Ni

ఈ సినిమాను నితిన్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.కిక్ డైరక్టర్ వక్కంతం వంశీ నితిన్ తో మరో కిక్ లాంటి సినిమా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

సినిమా అంతా సరదాగా ఉంటుందని చెబుతున్నారు.మాచర్ల నియోజకవర్గం సీరియస్ సబ్జెక్ట్ తో వస్తుంది.

Advertisement

ఆ తర్వాత వచ్చే వక్కంతం వంశీ సినిమా కామెడీగా ఉండబోతుందని తెలుస్తుంది.రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు నితిన్.

రైటర్ గా సక్సెస్ అయిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి ప్రయత్నంగా చేసిన నా పేరు సూర్య నిరాశపరచింది.ఇక ఇప్పుడు నితిన్ తో డైరక్టర్ గా సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు