పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యామీనన్.. ఏమన్నారంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ అనంతరం ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలతో ఎంతో మంచి హిట్ అందుకున్నారు.

ఈ విధంగా నిత్యామీనన్ తెలుగు తమిళ మలయాళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో గుర్తింపు పొందారు.హీరోయిన్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిత్యా మీనన్ కి సంబంధించిన ఎలాంటి గాసిస్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో వినిపించలేదు.

అయితే తాజాగా ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే మలయాల నటుడితో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారిందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోయే ఆ మలయాళీ హీరో ఎవరు అనే విషయం గురించి అభిమానులు పెద్ద ఎత్తున ఆరా తీశారు.

Nithya Menon Reacts On Her Marriage Rumors Details, Nithya Menon, Tollywood, Mod

నిత్యామీనన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలపై ఎట్టకేలకు ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, తాను పెళ్లి చేసుకోవడం లేదని తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని ఈమె తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఖండించారు.ఈ విధంగా పెళ్లిపై నిత్యామీనన్ స్పందించడంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.

Advertisement
Nithya Menon Reacts On Her Marriage Rumors Details, Nithya Menon, Tollywood, Mod

ఇకపోతే తాజాగా ఈమె మోడ్రన్ హైదరాబాద్ మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు