యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాతో నితిన్ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా చూస్తున్నాడు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా అనుకున్నదానికంటే ముందే షూటింగ్ ముగించుకుంటుండటంతో ఈ సినిమాను ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ క్రమంలో డిసెంబర్ నెలలో ఈ రంగ్ దే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే, సంక్రాంతి బరిలో తీవ్ర పోటీ ఎదుర్కొవాల్సిన పని ఉండదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అటు డిసెంబర్‌లో ఒకటి అరా సినిమాలు తప్ప పెద్దగా రిలీజ్ అయ్యేవి ఏమీ లేకపోవడంతో, ఈ నెలలో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో రంగ్ దే చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకే నితిన్ అండ్ టీమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
మరి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది.ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లకు మంచి ఆదరణ లభించింది.
రంగ్ దే చిత్రంతో నితిన్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy