నితిన్ హీరోయిన్ల విషయంలో మాత్రం ఖచ్చితం

నితిన్ కెరీర్ ని కాస్త దీక్షగా పరిశీలిస్తే బాబు అగ్రకథానాయికలను తప్ప కొత్త కథానాయికల్ని ఎంకరేజ్ చేసింది చాలా తక్కువే.

శ్రీ ఆంజనేయం సమయంలో చార్మి క్రేజీ హీరోయిన్.

సై లో జతకట్టిన జెనిలియా అప్పట్లో టాప్ హీరోయిన్.అల్లరి బుల్లోడులో త్రిష , మళ్ళి రామ్ లో జెనిలియా ని పట్టాడు.

త్రిష ఆ సమయానికి అగ్ర కథానాయిక.ఇలా హిట్స్ ఉన్నప్పుడు మాత్రమే కాదండోయ్.

ఫ్లాపుల్లో కూడా క్రేజీ హీరోయిన్స్ ని వదలలేదు నితిన్.ఆటాడిస్తా లో కాజల్, ఇక రెచ్చిపో చిత్రం ఏకంగా ఇలియానాని బుక్ చేసుకున్నాడు నితిన్.

Advertisement

ఆ చిత్రం వచ్చిన సమయంలో ఇలియానా డిమాండ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.హన్సిక టాప్ లో ఉండి, నితిన్ ఫ్లాపుల్లో ఉండగానే సీతారాముల కల్యాణం వచ్చింది.

హిట్స్ వచ్చాక కాస్త సడలించాడు కాని, ఇప్పుడు మళ్ళి టాప్ హీరోయిన్స్ మీదే పడ్డాడు.అ.ఆ లో ప్రస్తుతం నెం.1 హీరోయిన్ సమంతతో రోమాన్స్ చేస్తున్న నితిన్, లెవెల్ ఏమాత్రం తగ్గకుండా నెక్స్ట్ శృతి హాసన్ మీద కన్నేశాడు.విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కనున్న గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో శృతి హాసనే కథానాయిక అని గట్టిగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు