Niharika : నిహారిక నాగచైతన్య కాంబినేషన్ లో ఆ సూపర్ హిట్ సినిమా మిస్ అయిందా… అయనే కారణమా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో మెగా డాటర్ నిహారిక ( Niharika ) కూడా ఒకరు.

ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సక్సెస్ అందుకున్నారు.

ఈ కార్యక్రమం తర్వాత నిహారిక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇలా హీరోయిన్ గా ఈమె ఏకంగా మూడు సినిమాలలో నటించారు.

అయితే ఈమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు తన తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు.

ఇలా పెళ్లి చేసుకున్నటువంటి నిహారిక తన అత్తవారింటికి ఈమె సినిమాలలో కొనసాగడం ఇష్టం లేకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.కానీ నిహారిక తన అత్తగారింట్లో స్వేచ్ఛగా ఉండలేకపోవడంతో తన భర్తతో మనస్పర్ధలు వచ్చాయి.ఇలా మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు తీసుకొని విడిపోయారు.

Advertisement

ఇలా భర్త నుంచి విడిపోయిన తర్వాత నిహారిక తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం ఈమె వరస వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇక తాజాగా ఈమె మరొక కొత్త సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా నిహారికకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నిహారిక ఈ సినిమాలో కనుక నటించి ఉంటే ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగేది అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.మరి నిహారిక రిజెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.

నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమెకు కొంతమంది దర్శకులు సినిమా అవకాశాలను కూడా కల్పించారట.అయితే నాగచైతన్య ( Nagachaitanya ) హీరోగా నటించిన 100% లవ్ సినిమాలో కూడా ఈమెను నాగచైతన్య పక్కన హీరోయిన్గా తీసుకోవాలని భావించారట కానీ ఆ సమయంలో నాగబాబు ( Nagababu) కి తన కుమార్తెను ఇండస్ట్రీలోకి పంపించడం ఇష్టం లేదనే విషయం తెలియడంతో దర్శక నిర్మాతలు ఈ ఆలోచన విరమించుకున్నారట.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇలా నిహారికను ఇండస్ట్రీలోకి పంపించడం ఇష్టం లేదనే విషయం తెలియడంతో ఈ సినిమాలో తమన్నాకు అవకాశం కల్పించారు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.అయితే మొదట్లో తన కుమార్తెను ఇండస్ట్రీ లోకి పంపించనని చెప్పిన నాగబాబు అనంతరం తన కుమార్తెకు సినిమాలలో నటించాలనే కోరిక ఉందని తెలియడమే కాకుండా తన కూతురు కూడా సినిమాలలో నటిస్తానని చెప్పడంతో కాదనలేకపోయారట.అయితే నాగబాబు ముందుగానే తన కుమార్తెను సినిమాలలోకి పంపించి ఉంటే తప్పకుండా ఈ సినిమాలో నాగచైతన్య నిహారిక నటించే వారిని ఈ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కూడా కొనసాగేది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు