Niharika : ఒక అమ్మాయి పెళ్లైతే సినిమాలు ఎందుకు ఆపేయాలి.. నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Nagababu ) ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నాగబాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదట యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.2020లో జొన్నలగడ్డ చైతన్యను ( Jonnalagadda Chaitanya )వివాహం చేసుకొని నిహారిక ఊహించని విధంగా 2023లో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు ( Jonnalagadda Prabhakar Rao )కుమారుడైన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో నిహారిక-చైతన్యల విహహం అంగరంగ వైభవంగా జరిగింది.అయితే పెళ్లైన ఏడాదికే వీళ్ల మధ్య మనస్పర్దలు రావడంతో.

విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి.అయితే 2023 జూన్‌లో నిహారిక-చైతన్యలకు విడాకులు మంజూరు చేసింది కోర్టు.

ఆ సంగతి పక్కన పెడితే.పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నిహారిక తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పింది.

Advertisement

పెళ్లైతే సినిమాలు ( Movies if married )చేయకూడదనే ఉద్దేశంలో ఉన్నారని.ఆ ఆలోచన మారాలని అంటున్నారు నిహారిక.తన వదిన లావణ్య త్రిపాఠిని సైతం ఇదే విధంగా చూస్తున్నారంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది నిహారిక.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ( niharika )ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఇకపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్తున్నాను.

వర్క్ పరంగా బిజీగా ఉన్నాను.తమిళ్ సినిమా చేస్తున్నాను.

ప్రొడక్షన్ కూడా చేస్తున్నను.ఐదేళ్ల తరువాత మళ్లీ సినిమా చేస్తున్నాను.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

నన్ను నేను థియేటర్స్‌లో చూసుకొని ఐదేళ్లు అయ్యింది.సూర్యకాంతం సినిమా తరువాత మళ్లీ సినిమా చేయలేదు.

Advertisement

నాకు ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే నా పెళ్లి.నాకు పెళ్లైన తరువాత సినిమాలు ఆపేయాలని చాలామంది అనుకున్నారు.ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే.

ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందంటే సినిమాలు చేయదేమో అని అనుకుంటారు.అసలు ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి.మా వదిన లావణ్యని కూడా ఇదే అడిగారు.

సినిమాలు చేయడం ఆపేస్తారా? అని పెళ్లైతే సినిమాలు ఆపేయాలా? సినిమాకి పర్సనల్ లైఫ్‌కి సంబంధం ఏంటి?ఐదేళ్ల తరువాత మళ్లీ సినిమాలు చేయడం హ్యాపీగా ఉంది.నాకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్.

నాకు నచ్చినట్టు ఉండటమే నాకు ఇష్టం.జరిగింది జరిగిపోయింది అందుకే రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

ఈ సందర్భంగా నిహారిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో కొందరు ఆమెపై నెగటివ్గా కామెంట్స్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు