నేను ప్రభాస్ ని పెళ్లి చేసుకోవట్లేదంటున్న మెగా డాటర్...

టాలీవుడ్ సినీ పరిశ్రమకి మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి నిహారిక కొణిదెల గురించి తెలియని వారుండరు.

అయితే ఈమె సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో సినీ జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేక పోతుంది.

అంతేకాక ఈ అమ్మడు నటించినటువంటి పలు చిత్రాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకో లేకపోయాయి.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు.

అయితే ఈ మధ్య కాలంలో నిహారిక కొణిదెల సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.తాజాగా నిహారిక తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించింది.

ఇందులో భాగంగా తన అభిమానులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.అయితే ఇందులో "ఓ నెటిజన్ మీరు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజమా.? అని" అడిగాడు.దీంతో నిహారిక ఈ విషయంపై స్పందిస్తూ "అలాంటిదేమీ లేదని అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసింది.

Advertisement

అయితే ఈ పెళ్లి పుకార్లు ఒక ప్రభాస్ విషయంలోనే కాదని సాయి తేజ్ ని కూడా గతంలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుకార్లు" సృష్టించారని చెప్పుకొచ్చింది.అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లను పుట్టించడం సరికాదని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే నిహారిక ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు