పశ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వానికి ఎన్జీటీ షాక్

ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యున‌ల్ షాక్ ఇచ్చింది.చెత్త నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మైంద‌ని రూ.

3500 కోట్ల జ‌రిమానా విధించింది.2022-23 రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌కారం ప‌ట్టణ అభివృద్ది, మున్సిప‌ల్ వ్య‌వ‌హారాల‌కు రూ.12,819 కోట్లు ఖ‌ర్చు చేసే వెసులుబాటు ఉంది.అయినా మురుగు, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఎన్జీటీ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ఈ క్ర‌మంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని తెలిపింది.రెండు నెల‌ల్లోపు రూ.3500 కోట్ల‌ను ప్ర‌భుత్వం జ‌మ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా చెత్త నిర్వ‌హ‌ణ‌పై స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

తాజా వార్తలు