పాన్ మసాలా యాడ్ వద్దు.. అమితాబ్ కు NGO లేఖ

పాన్ మసాలా యాడ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్ ను…  పాన్ మసాలా వ్యతిరేక ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఒక లేఖ కూడా రాసింది.

 పాన్ మసాలా యాడ్ వద్దు.. అమితాబ�-TeluguStop.com

ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తిగా ఉన్న అమితాబ్.ఒక పాన్ మసాలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం ఏమిటని ప్రశ్నించింది.

వెంటనే సదరు కంపెనీ తో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేయాలని కోరారు.గొప్ప స్థాయి గల వ్యక్తి అయిన అమితాబ్ ఒక పాన్ మసాలా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే యువత పెడదారి పడుతుంది అని వివరించింది.

పాన్ మసాలాకు బానిస అయ్యే అవకాశం ఉందని తెలిపింది.నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎరడికేషన్ ఆఫ్ టొబాకో అధ్యక్షుడు శేఖర్ సర్కార్ మాట్లాడుతూ… టొబాకో, పాన్ మసాలాకు ఎవరైనా.

ఎంతటి వారైనా.బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని ఓ మెడికల్ రిసెర్చ్ లో తేలిందన్నారు.

పల్స్ పోలియో లాంటి ఎన్నో మంచి వాటికి ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబచ్చన్ పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం తగదన్నారు.పాన్ (తమలపాకు) ప్రత్యక్ష క్యాన్సర్ కు కారకంగా పనిచేస్తుందని, తమలపాకులోని పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కారకాలుగా మారొచ్చని తాజా పరిశోధనలో వెల్లడైందని తెలిపారు.

ఇంటర్నేషనల్  ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ) , ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ ) తమలపాకు క్విడ్ (పాన్) నమిలే వారు క్యాన్సర్ బారిన పడినట్లుగా శాస్త్రీయ ఆధారాలు తెలియజేస్తుందని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube