తగ్గేదేలే అంటున్న అప్పుడే పుట్టిన బుడ్డోడు.. వీడియో వైరల్

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప.ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ మూవీలోని పాటలు, డైలాగులు ఓ రేంజ్​ లో పేలాయి.ఎంతలా అంటే ఈ పుష్ప ఫీవర్ ఒక టాలీవుడ్ కి మాత్రమే కాదు దేశ విదేశాల్లోనూ డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి.

ఇందులోని డ్యాన్స్ స్టెప్పులు కూడా తెగ వైరల్ అయ్యాయి.చాలా మంది పుష్ప డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు.

ఈ రీల్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి.అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ పుష్ప స్టైల్స్ ను ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు.

Advertisement

వారు కూడా ఆ స్టైల్స్​ ను అనుకరిస్తూ రీల్స్ చేస్తున్నారు.ఇక ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప స్టైల్ రిపీట్ చేస్తున్నారు.

ఇలా పుష్ప స్టైల్ ను అనుకరిస్తున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడా అని ఎదురు చూస్తున్నారా.

ఆ వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ఏదో పెద్ద వ్యక్తి అయితే పరవాలేదు.కానీ ఆ వ్యక్తి అప్పుడే పుట్టిన వ్యక్తి కావడం విశేషం.

 అతడు కూడా అచ్చంగా పుష్ప మూవీలో అల్లు అర్జున్ మాదిరిగానే గడ్డం కింద చేతులు పెట్టి తగ్గేదేలే అంటూ అనుకరించాడు.ఈ వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

అది వైరల్ గా మారింది.పుష్ప ఫీవర్ అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా పాకిందని ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

Advertisement

ఈ వీడియోను ఇప్పటికే అనేక మంది షేర్ చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వెంటనే చూసేయండి.

తాజా వార్తలు