న్యూయార్క్‌‌పై ఇడా తుపాను విశ్వరూపం.. నీటమునిగిన అమెరికా వాణిజ్య రాజధాని, ఎమర్జెన్సీ విధింపు

అమెరికాను గడిచిన కొన్ని రోజులుగా ఇడా తుఫాను వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే లూసియానా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను.

తాజాగా దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌పైనా తన ప్రతాపం చూపుతోంది.ఇడా కారణంగా కురుస్తోన్న భారీ వర్షాలకు నగరం నీటమునిగింది.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.తుపాను కారణంగా ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

భారీ వర్షాలతో న్యూయార్క్‌లో వరదలు పోటెత్తాయి.దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

అండర్‌పాస్‌ వంతెనలు, రైల్వే స్టేషన్లు సబ్‌వేల్లోకి భారీగా నీరు చేరింది.రహదారులు నదులను తలపిస్తున్నాయి.

చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దవ్వగా.

మెట్రో రవాణాను నిలిపివేశారు.ఓ మెట్రో స్టేషన్లోకి వరద నీరు పోటెత్తిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.నేషనల్ వెదర్ సర్వీస్ న్యూయార్క్‌ సెంట్రల్ పార్క్‌లో ఒక గంటలో 3.15 ఇంచ్‌ల వర్షపాతం నయోదైనట్లుగా తెలిపింది.ఆగస్ట్ 22న రాత్రి హెన్రీ తుఫాను సమయంలో ఒక గంటలో 1.94 ఇంచ్‌ల వర్షపాతం నమోదవ్వగా.దానిని ఇడా అధిగమించింది.

కాగా, ఇడా హరికేన్ ప్రభావంతో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తున్నాయని యూఎస్ జియలాజికల్ డిపార్టుమెంట్ ప్రకటించింది.దీని వల్ల భారీ విధ్వసం జరిగే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అయితే ఈ భీకరగాలుల వల్ల ఓ నది ఏకంగా తన దిశను మార్చుకుని ప్రవహించిన వ్యవహారం కలకలం రేపింది.ఆదివారం న్యూఓర్లిన్స్‌లోని మిస్సిస్సిపి నది వ్యతిరేక దిశలో ప్రవహించింది.2020లో లారా తుపాను, 1856లో లాస్ట్ ఐలాండ్ హరికేన్ తుపానులు లూసియానాలో అతి తీవ్రమైన, శక్తి వంతమైన తుపానులుగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు