కోవిడ్-19గా మారిన కరోనా వైరస్ వ్యాధి! ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడి చైనాలో వెయ్యి మందికి పైగా ఇప్పటి వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది ఇప్పటికే 43 వేల మంది వరకూ ఈ వ్యాధి బారిన పడ్డారు.

రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ వైరస్ ని అదుపు చేయలేకపోతున్నారు.

గత ఏడాది డిసెంబర్ లో ఈ వైరస్ వుహాన్ నగరంలో పుట్టింది.చైనా ఈ వైరస్ పై ఇప్పుడు పెద్ద యుద్ధమే చేస్తుంది.

ఈ వైరస్ కి ఎలాంటి చికిత్స, మందు లేకపోవడంతో మరింత విస్తరిస్తుంది.దగ్గు తుమ్ములు, శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా ఈ వ్యాధి చెందే అవకాశం ఉందంటే ఈ వైరస్ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు ఈ వ్యాధి కారణంగా చైనాలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు.

Advertisement

ఇండియాలో నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టారో అనేది ఈ ఘోరం చూస్తే అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ కి వలన వచ్చే వ్యాధికి కొత్త పేరు పెట్టింది.

ఇకపై ఈ వైరస్ వలన వచ్చే వ్యాధిని కోవిడ్-19గా పిలవాలని నిర్ణయించింది.కరోనా వైరస్ డిసీజ్ ని సంక్షిప్త రూపంగా ఈ పేరును డబ్ల్యూహెచ్ ఓ ఖరారు చేసింది.

ఇక ఇదే పేరుతో ప్రతి ఒక్కరు కరోనా వైరస్ వ్యాధికి ఇదే పేరు ఉపయోగించాలని తెలియజేసింది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు