వైరల్: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. రోడ్డుపై దొరికిన వంద నోటు.. తెరిచి చూడగా..?!

ప్రస్తుత సమాజంలో వ్యాపారలలో కాంపిటీషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక కంపెనీలు వారి వ్యాపారాన్ని విస్తరించేందుకు అనేక ప్రమోషన్స్ చేస్తుంటారు.

అందులో భాగంగా కంపెనీలో మార్కెటింగ్( Marketing ) ప్రకటనల కొరకు పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటాయి.మరికొన్ని సంస్థలు అయితే ఏకంగా స్టార్ హీరోలు, అలాగే క్రికెటర్లతో కూడా యాడ్స్ చేపించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి.

మరికొన్ని కంపెనీలు బాగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో పెద్దపెద్ద హార్డింగ్స్ పెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

ఇకపోతే మార్కెటింగ్ కోసం ఇంత పెద్ద స్ట్రాటజీస్, డబ్బులు ఖర్చు పెట్టడం లాంటిది చేయలేనివారు పాంప్లేట్లను పంచుతుంటారు.అయితే వీటిని చాలామంది పట్టించుకోరు.తీసుకున్న తర్వాత వెంటనే వాటిని చదివి రోడ్డుపై పడేస్తారు.

Advertisement

కాకపోతే ఇలాంటి నేపథ్యంలో ఓ కేఫే యాజమాన్యం వినూత్నంగా ఆలోచించి వారి పబ్లిసిటీని ప్లాన్ చేసింది.నిజానికి కేఫే( Cafe ) వారు చేసిన క్రియేటివిటీకి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వైరల్ గా మారిన వీడియోలో అసలు విషయం చూస్తే రోడ్డుపై ఓ వంద రూపాయల నోటు పడి ఉంటుంది.ఓ వ్యక్తి తనకి రోడ్డుపై వెళ్తున్న సమయంలో 100 రూపాయలు దొరికిందన్న సంతోషంలో దాన్ని వెళ్లి తీయడానికి ప్రయత్నిస్తాడు.ఆ వంద రూపాయల నోటు ( One hundred rupee note )ను తీసుకొని పూర్తిగా వ్యక్తి మరోవైపు చూసి ఒకంత షాక్ అవుతాడు.

దీనికి కారణం నోటు అవతలి వైపు కేఫ్ కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచి ఉంటాయి.వారి కేఫ్ లో ఏ ఆహార పదార్థాలు దొరుకుతాయి వాటి వివరాలను సంబంధించి పూర్తి కొత్త తరహా యాడ్ ను ప్రజలకు చేరేలా కంపెనీ ప్లాన్ చేసింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

ప్రస్తుతం ఈ తరహా ప్లాన్ అందరిని ఆకట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు