సినిమాలు చేయవు, పెళ్లి చేసుకోవు మరి ఏం చేస్తావ్‌ స్వీటీ?

అనుష్క తీరుపై అభిమానులు చాలా కోపంగా ఉన్నారు.రెండు సంవత్సరాలుగా అనుష్క సినిమాలు చేయలేదు.

బాహుబలి క్రేజ్‌ను అంతా ఉపయోగించుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారు.కాని ఇప్పటి వరకు అనుష్క మాత్రం ఆ క్రేజ్‌ను ఎక్కడా ఉపయోగించుకోవడం లేదు.

వరుసగా ఆమె సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆమె పది సినిమాల్లో చేసేది.ఎంత లేదన్నా కనీసం పది కోట్లు అయినా ఆమె ఖాతాలో పడేవి.

కోట్లు పక్కకు పెడితే అభిమానులను కనీసం సంతోష పెట్టేది.కాని అనుష్క మాత్రం సినిమాలు చేయడంలో నత్త నడక నడుస్తోంది.భాగమతి చిత్రం తర్వాత నిశబ్దం సినిమాను చేసేందుకు సంవత్సరం కంటే ఎక్కువ తీసుకుంది.

Advertisement

ఈ సమయంలో మరేదైనా సినిమా చేస్తుందా అంటే అదీ లేదు.ఈ అమ్మడి తీరు చూస్తుంటే కొందరు కుళ్లుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం ఈమె తీరు అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు.

మొత్తానికి ఈ అమ్మడు ఏం చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్‌ అంటున్నారు.

సినిమాలు చేయడం లేదు కనుక కనీసం పెళ్లి అయినా చేసుకోవచ్చు కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.పెళ్లి వార్తలు ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడేనా అన్నట్లుగా చెబుతుంది.ఇక రిలేషన్‌లో ఏమైనా ఉందా అంటే అమ్మా నాన్న చూసిన వారినే చేసుకుంటాను అంటూ మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంది.

తాజాగా కూడా తన ప్రేమ వివాహం వార్తలను అనుష్క కొట్టి పారేసిన విషయం తెల్సిందే.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు