ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి..?

బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసి రీఎంట్రీలో సైతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి.

అయితే రాజకీయాల్లోకి వెళ్లకముందు స్ట్రెయిట్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన చిరంజీవి రీఎంట్రీలో మాత్రం రీమేక్ సినిమాల్లో నటించడానికే ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న చిరంజీవి ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటించనున్నారు.అయితే లూసిఫర్ డైరెక్టర్ విషయంలో మాత్రం చిరంజీవి సాధారణ ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారు.ఈ సినిమాకు దర్శకునిగా చాలామంది పేర్లు వినిపించినా చివరికి తమిళ దర్శకుడు మోహన్ రాజా పేరు ఫైనల్ అయింది.

అయితే టాలీవుడ్ దర్శకులకు ఛాన్స్ ఇవ్వకుండా కోలీవుడ్ దర్శకుడిని చిరంజీవి నమ్మడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఈ సినిమాకు డైరెక్టర్ గా మొదట సాహో ఫేమ్ సుజీత్ పేరు వినిపించింది.అయితే సుజీత్ కథలో చేసిన మార్పులు చిరంజీవికి నచ్చకపోవడంతో సుజీత్ ఈ సినిమా నుంచి చెప్పింది.ఆ తరువాత చిరంజీవికి రీమేక్ కథలతో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 లాంటి హిట్లు ఇచ్చిన వీవీ వినాయక్ పేరు వినిపించినా వీవీ వినాయక్ చెప్పిన కామెడీ సన్నివేశాలు చిరంజీవికి నచ్చలేదని సమాచారం.

ఒక దశలో బాబీ పేరు కూడా వినిపించినా ఆయన కూడా ఫైనల్ కాలేదు.అయితే చిరంజీవి చివరకు కోలీవుడ్ దర్శకునికి ఛాన్స్ ఇవ్వడంతో చిరుకు టాలీవుడ్ దర్శకులపై నమ్మకం లేదా.? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే చిరంజీవి అభిమానులు మాత్రం మెగాస్టార్ తెలుగు దర్శకులను కాదని కోలీవుడ్ దర్శకునికి ఛాన్స్ ఇచ్చారంటే ఏదో ఒక ముఖ్యమైన కారణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు