రైతుబిడ్డ కాదు రాయల్ బిడ్డ.. పల్లవి ప్రశాంత్ మాటలకు చేతలకు పొంతన లేదుగా!

రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రైతు బిడ్డ( Rythu Bidda ) అనే ట్యాగ్ తో బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీగా సింపతి సంపాదించుకోవడంతో పాటు ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే.

హౌస్ లో ఉన్నంతవరకు హౌస్ కు వెళ్లక ముందు వరకు ఒక రకమైన యాటిట్యూడ్ చూపిస్తూ ఏమీ తెలియని అమాయకుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత వాకింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ మారిపోయాయి.ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఈ మధ్యకాలంలో లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేసిన చాలా మంది భారీగా ట్రోల్స్ చేస్తూ ఏకిపారేస్తున్నారు.అతను కూడా తగ్గేదేలే అన్నట్టు అల్లు అర్జున్ డైలాగ్ ని రెట్టించి చెప్తూ ఉంటాడు.మల్లొచ్చినా అన్న అంటూనే ఉంటాడు.

అయితే బిగ్ బాస్ టైటిల్‌ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో రైతులకు( Farmers ) సాయం చేస్తానని బిగ్ బాస్ స్టేజి మీద ప్రకటించాడు కూడా.ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రతిసారి ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ అతనిపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

ఇక మొదట్లో ఆ ట్రోల్ తట్టుకోలేక ఒక పేద కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేసిన పల్లవి ప్రశాంతి మామ అనుకుంటూ చేతులు దులుపేసుకున్నాడు.

ఇక ఇప్పుడు పల్లవి ప్రశాంతి తన డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేసి ఒక హీరో లెక్క రాయల్ ఫామిలీలోని వ్యక్తి లెక్క మారిపోయాడు.ఇప్పుడు ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.దాంతో నెటిజన్స్ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

మోడరన్ రైతు బిడ్డ, రైతు బిడ్డ అన్న మాట మర్చిపోయినట్టున్నాడు, రైతు బిడ్డ ఇలా ఐపోయాడు ఏమిటి ? నీ యవ్వారం చూస్తుంటే ఇక పొలం పనులు చేయవనుకుంటా ఇగ రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడు బాబో భారీగా ట్రోల్స్ చేస్తూ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.రైతుబిడ్డ రాయల్ బిడ్డ అనే ట్యాగ్ ని జోడించి ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు నెటిజన్స్.

భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకున్న బిగ్ బాస్ 8 ఫినాలే... నాగార్జున పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు