నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్!

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌( Netflix ) యూజర్లకు భారీ షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.

ఎప్పటినుండో అనుకుంటూ వస్తున్న పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రెడీ అయింది.

దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు వారి అకౌంట్లను స్నేహితులకు, సన్నిహితులకు ఉచితంగా షేర్‌ చేసే సదవకాశాన్ని కోల్పోనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే పాస్‌ వర్డ్‌ షేరింగ్‌( Password Sharing )పై అదనపు ఛార్జీలు, యాడ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ వంటి ఫీచర్లను ఎనేబుల్‌ చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌ మంగళవారం బ్రిటన్‌, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, మెక్సికో, సింగపూర్‌, బ్రెజిల్‌ దేశాలలో పాస్ వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.అంతేకాకుండా 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్‌ కూడా చేసింది.ఆ ఇ-మెయిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు ఒక అకౌంట్‌ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్‌ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తామన్నట్టు పేర్కొంది.

Advertisement

ఈ నేపథ్యంలో 100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు( Login Details ) ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్‌ చేసినట్లు కంపెనీ విశ్లేషించింది.ఈ మార్చి చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్ల యూజర్లు ఉన్నారు.కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు.

గానీ ఇతరులకు షేర్ చేస్తేనే ఈ అదనపు చార్జీలు అనేవి ఉంటాయి.కాగా ప్రయాణంలో ఇతర డివైజ్‌లలో లాగిన్‌ అయ్యే అవకాశాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు