చిత్తూరులో వేపచెట్టు నుంచి కారుతున్న పాలు.. మిస్టరీ ఏంటంటే?

ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

గతంలో కూడా వింత ఘటనలు జరిగినా సోషల్ మీడియా వినియోగం తక్కువ కాబట్టి ఆ వార్తలు వెలుగులోకి వచ్చేవి కావు.

కానీ ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచంకి తెలిసిపోతున్నాయి.తాజాగా చిత్తూరు జిల్లాలో వేపచెట్టు నుంచి పాలు కారుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జిల్లాలోని బొడిరెడ్డి కండ్రిగ గ్రామంలో నాగాలమ్మ దేవాలయం సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి.

దీంతో గ్రామస్తులు ఆ చెట్టుకు మహిళలు ఉన్నాయని అందువల్లే పాలు కారుతున్నాయని భావిస్తున్నారు.కొందరు భక్తులైతే ఏకంగా ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు.

Advertisement

చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున జనాలు ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటూ చెట్టు నుంచి పాలు కారడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు భక్తులైతే ఏకంగా నాగాలమ్మ దేవత ఆలయానికి సమీపంలో ఉన్న చెట్టు కావడంతో దేవతే వృక్షంలో కొలువై ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు కురుస్తున్నా ప్రజలు చెట్టును దర్శించుకోవడానికి వస్తూ ఉండటం గమనార్హం.మరి కొందరైతే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెట్టు నుంచి పాలు కారతాయని చెప్పారని ప్రస్తుతం అదే విధంగా జరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే నిపుణులు మాత్రం పాలు కారడానికి ఆసక్తికరమైన కారణాలను వెల్లడిస్తున్నారు.సాధారణంగా కొన్ని చెట్లు లేత వయస్సులో ఉన్న సమయంలో పాలు వస్తాయని.అయితే అవి పాలు కావని.

పెద్ద చెట్లలో తెల్లటి, చెద పురుగులు చెట్టులో నివాసం ఏర్పరచుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అవి చెట్లలోనే చచ్చిపోతాయని.వాటి రక్తం తెల్లగా ఉండటంతో పాలు అని చాలామంది భ్రమపడతారని చెబుతున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు