జీపీఎస్ చూపించిన షార్ట్ డిస్టెన్స్‌లో వెళ్లిన యూఎస్ వ్యక్తికి నియర్-డెత్ ఎక్స్‌పీరియన్స్..

వాల్టర్ ఫిషెల్( Walter Fishel ) అనే 55 ఏళ్ల అమెరికన్ టూరిస్ట్ జీపీఎస్ కారణంగా మరణ అంచుకు వెళ్లొచ్చాడు.

వాల్టర్ దక్షిణాఫ్రికాలో నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాడు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పరిసరాల్లో ఒకటైన న్యాంగాలో నలుగురు వ్యక్తులు అతన్ని దోచుకుని, ముఖంపై కాల్చారు.సైమన్ టౌన్‌లోని తన అకామిడేషన్‌కు మోస్ట్ షార్ట్ GPS రూట్ ఫాలో అవుతూ తనకి తెలియకుండానే అక్కడికి వెళ్లాడు.

అతను తన స్నేహితులను సందర్శించడానికి నవంబర్ 3న కేప్ టౌన్ చేరుకున్నాడు.ఒక వారం పాటు హెర్మానస్‌లో ఉండాలని ప్లాన్ చేశాడు.విమానాశ్రయంలో కారు అద్దెకు తీసుకుని డబ్బు మార్చుకున్నాడు.

హైవేలో ట్రాఫిక్ ఉన్నందున అతి తక్కువ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.తాను న్యాంగాలో ట్రాఫిక్‌తో ఆగిపోయానని, ముందుకు అసలు కదల లేకపోయానని చెప్పాడు.

Advertisement
Near-death Experience For A US Man Who Traveled A Short Distance Shown By GPS, A

అంతలోనే నలుగురు వ్యక్తులు అతని కారును చుట్టుముట్టి తలుపులు తెరిచారు.

Near-death Experience For A Us Man Who Traveled A Short Distance Shown By Gps, A

అతను వారిలో ఒకరి తుపాకీని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ వ్యక్తి అతని ముఖంపై కాల్చి అతని కీలను తీసుకున్నాడు.వారు అతని బ్యాగ్‌ను కూడా కారు బూట్‌లో నుంచి తీసివేసి రక్తస్రావంతో రోడ్డుపై వదిలేశారు.ఫేస్ లో కాల్చడంతో వాల్టర్ కొన్ని పళ్ళు, బుల్లెట్ ఉమ్మివేసాడు.

స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అతనిని జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పారు.అయితే, అతని ముఖంలో బుల్లెట్ రంధ్రం, విరిగిన మాండబుల్( Mandible ) ఉన్నట్లు వారు కనుగొన్నారు.

అతన్ని మెరుగైన సౌకర్యాలు ఉన్న రోండెబోష్ మెడికల్ సెంటర్‌కు( Rondebosch Medical Center ) బదిలీ చేశారు.

Near-death Experience For A Us Man Who Traveled A Short Distance Shown By Gps, A
అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

గాయం కాస్త ఎక్కువైనా చనిపోయే అవకాశం ఉందని చెప్పారు.ఊపిరితిత్తులలోకి రక్తం చేరకుండా ఉండాలంటే వాయుమార్గాన్ని భద్రపరచాలని వైద్యులు చెప్పారు.అతను ఇప్పుడు కోలుకున్నాడు, తిరిగి US వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు.

Advertisement

ప్రమాద ప్రాంతాల గురించి పర్యాటకులకు ఎటువంటి హెచ్చరికలు లేవని అతను ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.ప్రయాణికులకు భద్రత కల్పించాలని అధికారులను కోరారు.

తాజా వార్తలు