కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) అంటే ఎవరు గుర్తుపట్టరు.కానీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna ) మాజీ బాయ్ ఫ్రెండ్ అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపడతారు.
రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ (Kirik Party) అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలో మొదటిసారి హీరోగా చేశారు.ఆ తర్వాత కొన్ని సినిమాలు చేస్తూ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి కూడా పరిచయం అయ్యారు.
అయితే అలాంటి రక్షిత్ శెట్టి టాలీవుడ్ లో అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ, సప్త సాగరాలు దాటి సైడ్ A అనే సినిమా సెప్టెంబర్ 22 న రిలీజ్ అయింది.
అలాగే సప్త సాగరాలు దాటి సైడ్ B (Saptha Sagaralu Dati Side B) అనే మూవీ నవంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.
అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షిత్ శెట్టి తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.నేను ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న సమయంలో హాస్టల్లో ఉండేవాడిని.ఇక ఆ టైంలో నేను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించా.

కానీ ఆ అమ్మాయి రోజు బస్సులో వస్తూ పోతూ ఉండేది.అయితే అమ్మాయికి నా ప్రేమ విషయం డైరెక్ట్ గా చెప్పకుండా ఎన్నో ప్రేమలేఖలు రాశాను.ఇక ఆ లవ్ లెటర్స్( Love Letters ) అన్ని నా ఫ్రెండ్ ద్వారా ఆమెకు పంపాను.
కానీ నేను ఎన్ని లెటర్స్ రాసినా కూడా ఆమె నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.చివరికి కాలేజ్ కూడా అయిపోయింది.

కానీ జరిగిందేంటంటే నేను లవ్ లెటర్స్ పంపిన నా ఫ్రెండ్ నేను ప్రేమించిన అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకొని భార్యాభర్తలయ్యారు.ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.నేను ఇచ్చిన లవ్ లెటర్స్ ఒక్కటి కూడా వాడు ఇవ్వలేదు.నా ప్రేమ విషయం చెప్పమంటే వాడు ఆమెను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు అంటూ రక్షిత్ శెట్టి (Rakshith Shetty) చెప్పడంతో అక్కడున్న యాంకర్ తో పాటు హీరోయిన్ నవ్వడం స్టార్ట్ చేశారు.