నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా NBK107.బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నాడు.
ఈ విజయాన్ని కొనసాగించాలని తహతహ లాడుతున్నాడు.అందుకే మాంచి మాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.
గోపిచంద్ మలినేని కూడా క్రాక్ వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై నందమూరి ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా ప్రకటించి సగానికి పైగానే షూటింగ్ కూడా పూర్తి చేసిన ఇంకా టైటిల్ మాత్రం రివీల్ చెయ్యలేదు.
దీంతో ఈ సినిమా టైటిల్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసారు.ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయడానికి అక్టోబర్ 21న డేట్ ఫిక్స్ చేసారు.
ఆ రోజు అధికారికంగా ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy