బాలకృష్ణతో నటించేందుకు నయనతార దిమ్మతిరిగే డిమాండ్

నయనతార .అసలేం మత్తు చేస్తోందో మ్యాజిక్ చేస్తోందో అర్థం కావడం లేదు.

అనుష్క లాగా భారీ సినిమాలు, పోరాట సన్నివేశాలు, శారీరక శ్రమ కలిగించే పాత్రలు చేయడం లేదు.కాజల్ అగర్వాల్ , శృతిహాసన్ లాగా అందాల ప్రదర్శనతో పడేసే ప్రయత్నం కూడా చేయడం లేదు, రకుల్ ప్రీత్ లాగా సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పడం లేదు.

ఈమధ్య బాబు బంగారం మినహాయిస్తే, ఇటు తెలుగులో, అటు తమిళంలో స్టార్ హీరోలతో పనిచేసింది లేదు.అయనా ఈ అమ్మడి రెమ్యునరేషన్ ఇప్పట్లో సౌత్ లో మరో హీరోయిన్ అందుకోలేని రేంజ్ లో ఉంది.

తమిళ టాప్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ భారి సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.రజినీకాంత్ కి లింగా రూపంలో ఫ్లాప్ ఇచ్చిన రవికుమార్, ఈసారి భారి హిట్ కొట్టి తనలో చేవ తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటున్నారు.

Advertisement

అందుకే బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా ప్లాన్ చేసారు.మరి భారి సినిమా అన్నప్పుడు క్రేజీ హీరోయిన్ కూడా కావాలి కదా.అందుకే నయనతార వైపు వెళ్ళారు.ఈ సినిమాకి నయనతార అందుకోబోతున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలు నాలుగు కోట్లు.అనుష్క రెండు కోట్లు తీసుకుంటోంది.

దానికి డబుల్ ఛార్జ్ చేస్తోంది నయన్.దక్షిణాదిలో చాలాకాలంగా నయనతారే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి.ఇప్పుడు మిగితా హీరోయిన్లకి నయనతారకి ఇంకొంచెం దూరం పెరిగింది అంతే.అంత పెట్టి నయనతారని ప్రత్యేకంగా తీసుకోవడం ఎందుకు? అనుష్క అయితే బాగుండేది కదా అని మీరు అనుకుంటున్నారేమో.నయనతారనే తీసుకోవడానికి కారణం తమిళంలో సినిమా మార్కేట్ పెరగడం కోసం.

కేఎస్ రవికుమార్ తమిళంలో పెద్ద డైరెక్టర్.నయనతార నెం.1 హీరోయిన్.దాంతో ఈ సినిమాకి తమిళంలో గిరాకి పెరుగుతుంది.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు