ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది... భర్తకు స్పెషల్ థాంక్స్ చెప్పిన నయనతార!

సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించి పూర్తిగా తన సమయాన్ని తన ఫ్యామిలీ కోసం ఉపయోగిస్తున్నారు.

ఇటీవల పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార తన పిల్లల బాగోగులను చూసుకుంటూ సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.

ఇలా సినిమాలకు నయనతార దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Nayanatara Special Thanks To Her Husband Vignesh Shivan Details, Nayanatara,vign

ఇకపోతే తాజాగా ఈమె తన భర్త విగ్నేష్ శివన్( Vignesh Shivan ) గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.నయనతార విగ్నేష్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరి పరిచయం నేను రౌడీనే( Nenu Rowdy Ne ) అనే సినిమా ద్వారా అయిందని చెప్పాలి.

ఈ సినిమాకు డైరెక్టర్గా విగ్నేష్ పని చేశారు.నయనతార విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా సమయంలోనే విగ్నేష్ తనకు పరిచయం కావడం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది.

Nayanatara Special Thanks To Her Husband Vignesh Shivan Details, Nayanatara,vign
Advertisement
Nayanatara Special Thanks To Her Husband Vignesh Shivan Details, Nayanatara,Vign

ఇక ఈ సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావడంతో నయనతార ఈ సినిమా లోని కొన్ని ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేస్తూ తన భర్తకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.నా కెరీర్‌ను గొప్పగా మలుపుతిప్పిన సినిమా ‘నేను రౌడినే’.

9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది.ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను.

ఇలాంటి ఒక గొప్ప సినిమాని అందించిన విగ్నేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సినిమా నటిగా నాకు ఎన్నో అనుభవాలను ఇవ్వడమే కాకుండా విగ్నేష్ ను కూడా నాకు ఇచ్చింది అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు