కన్నప్ప సినిమాలో ప్రభాస్ మాత్రమే కాదు నయనతార కూడనా... విష్ణు ప్లాన్స్ మామూలుగా లేవు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంచు విష్ణు( Manchu Vishnu ) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇక ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్( Mukesh Kumar Singh ) దర్శకత్వం వహించగా మోహన్ బాబు అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన టువంటి ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాలో సీనియర్ నటి మధుబాల ( Madhubala ) కూడా భాగం అవుతున్నారు.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను కన్నప్ప సినిమాలో భాగమవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో నయనతార ( Nayanatara ) ప్రభాస్ వంటి స్టార్ సెలబ్రిటీలతో కలిసిన నటించడం సంతోషంగా ఉంది అంటూ ఈమె మాట్లాడారు.

ఈ విధంగా ప్రభాస్ నయనతార కలిసిన నటించబోతున్నారు అన్న వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తోందా అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రభాస్ శివుడు పాత్రలో కనిపించగా నాయనతార ( Nayanatara )పార్వతి పాత్రలో కనిపించబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అయింది.

అయితే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.ఇలా ఈ సినిమాలో విష్ణు స్టార్ సెలబ్రిటీలు అందరిని భాగం చేయడంతో భారీ స్థాయిలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

మరి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు