నయనతార O2 టీజర్ టాక్..!

కేవలం కమర్షియల్ సినిమా హీరోయిన్ గా చేయడం కన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం.

కోలీవుడ్ లోనే కాదు సౌత్ సినీ పరిశ్రమలో నయనతారలా సినిమాలు చేసే హీరోయిన్ ఎవరు లేరని చెప్పొచ్చు.

ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారారు.తమిళ సినిమాలు కర్తవ్యం, మయూరి, కోకో కోకిల లాంటి సినిమాలు స్టార్ సినిమాలకు ధీటుగా ఆడాయి.

ఈమధ్యనే విజయ్ సేతుపతి, సమంత తో కలిసి కాతువాకుల రెండు కాదల్ సినిమా చేసింది నయనతార.ఆ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నయనతార ప్రస్తుతం O2 అంటూ ఓ సినిమాతో వస్తుంది.

జి.ఎస్ విఘ్నేష్ డైరక్షన్ లో థ్రిల్లర్ సినిమాగా వస్తుంది O2.సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.ఇక టీజర్ చూస్తే.

Advertisement

నయనతార ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడుతుంది.అందులో ఉన్న ప్రయాణీకులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎలా ప్రయత్నించారు అన్నది సినిమా కథ.సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది.సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు.

డిస్నీ + హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.నయనతార నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ O2 అని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు