నవీన్ పొలిశెట్టి గురించి తన తల్లిదండ్రులు ఏమన్నారంటే?

నవీన్ పొలిశెట్టి పేరు ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మార్మోగుతుంది.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు.

ఎందుకంటే ఇక్కడ సక్సెస్ ని మాత్రమే కొలమానంగా చూస్తారు.నువ్వు సక్సెస్ లో ఉంటే వారికి నువ్ హాట్ కేక్ లాంటి వాడివి, సక్సెస్ లో లేకుంటే కనీసం పలకరించే వారు కూడా ఎవరు ఉండరని చాలా మంది సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు గట్టిగా చెప్పిన మాట.అందుకే హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలనే రీతిలో వ్యవహరిస్తారు.అయితే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా ఇండస్ట్రీలో నువ్ హీరోగా హిట్ కొడితే ఇక ఆ ఆనందం చెప్పలేనిది.

ఎందుకంటే ఈ హిట్ వెనుక చాలా మంది కృషి ఉంటుంది.ఇక ఆ నటుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా తమ కొడుకు పెద్ద స్టార్ అయ్యాడని తెలిస్తే తల్లి దండ్రులు ఎంత సంతోషిస్తారో మనం ఊహించలేం.

అచ్చం ఇలాగే నవీన్ పొలిశెట్టి కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు.నవీన్ పోలిశెట్టి సినిమా పరిశ్రమకు వచ్చినాక 12 ఏళ్ల తరువాత సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారాడు.అయితే ఈ విజయం పట్ల నవీన్ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.12 ఏళ్లుగా మా కొడుకు పట్ల మాకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్నో అవమానాలు భరించాడని నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు.

Advertisement
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు