మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదల తేదీ పై మరింత క్లారిటీ.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌

రెండు సంవత్సరాలుగా నవీన్ పొలిశెట్టి అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు ఈ సమ్మర్ లో విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరించే విధంగా నవీన్ పొలిశెట్టి సినిమా ఉంటుందనే నమ్మకం ఇప్పటికే అందరిలో ఉంది.

అందుకు తగ్గట్లే మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి రూపొందింది.

Naveen Polishetty And Anushka Miss Shetty Mr Polishetty Movie Release Date,navee

ఈ సినిమా గురించి ఏడాది కాలం గా ప్రచారం చేస్తూ అంచనాలు పెంచారు.ఈ సమ్మర్ లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.అయితే సమ్మర్‌ లో ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు.

కానీ మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌ నెల మొత్తం కూడా ఇప్పటికే అన్ని వారాలకు సినిమాలు బుక్ అయ్యి ఉన్నాయి.కనుక మే మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు.

Advertisement
Naveen Polishetty And Anushka Miss Shetty Mr Polishetty Movie Release Date,navee

మే మొదటి వారంలో కూడా ఉగ్రం సినిమా ఉంది.అయినా కూడా ఆ సినిమా తో పాటే ఈ సినిమా ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

అతి త్వరలోనే అధికారికంగా డేట్‌ ను ప్రకటించే అవకాశం ఉంది.ఆ తేదీ మిస్ అయితే మళ్లీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

కనుక అన్ని అనుకున్నట్లుగా జరిగితే మే 5వ తారీకున నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Naveen Polishetty And Anushka Miss Shetty Mr Polishetty Movie Release Date,navee

అనుష్క నిశబ్దం సినిమా తర్వాత మరే సినిమా తో ఇప్పటి వరకు రాలేదు.కనుక ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుంది అంటున్నారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఇక యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు.జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టికి ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు