వేస‌విలో వేధించే త‌ల‌నొప్పి.. మందులు వాడ‌కుండా ఎలా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చో తెలుసా..?

వేసవి కాలంలో చాలా అధికంగా వేధించే సమస్యల్లో తలనొప్పి( Headache) ఒకటి.

ఎండల ప్రభావం, డీహైడ్రేషన్, ఒత్తిడి, రక్తపోటు అదుపు తప్పడం తదితర కారణాల వల్ల వేసవిలో తలనొప్పి తరచూ ఇబ్బంది పెడుతుంటుంది.

తలనొప్పిగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలా మందికి ఉన్న అలవాటు.కానీ ఆస్తమాను పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

అందుకే మందులు వాడకుండా తలనొప్పి నుంచి ఎలా రిలీఫ్ పొందవచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.వేసవిలో తలనొప్పికి ప్రధాన కారణం డీహైడ్రేషన్( Dehydration )తలనొప్పికి దూరంగా ఉండాలంటే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.

అందుకోసం వాటర్ మాత్రమే కాకుండా ఫ్రూట్ జ్యూస్ లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, రాగి జావా వంటివి తీసుకోవాలి.ఇవి డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తాయి.

Advertisement
Natural Remedies To Get Rid Of Headaches In Summer! Headache, Natural Remedies,

మరియు బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తాయి.త‌ల‌నొప్పి రాకుండా అడ్డుకుంటాయి.

Natural Remedies To Get Rid Of Headaches In Summer Headache, Natural Remedies,

అలాగే తలనొప్పికి యాలకులు( Cardamom water ) న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తాయి.ఒక గ్లాసు వాటర్ లో మూడు నుంచి నాలుగు దంచిన యాలకులు వేసి మరిగించాలి.తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ యాలకుల వాటర్ ను గోరువెచ్చగా తీసుకుంటే క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.

లెమన్ వాటర్, గ్రీన్ టీ, జింజర్ టీ, ఆరెంజ్ జ్యూస్ వంటివి తీసుకున్నా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Natural Remedies To Get Rid Of Headaches In Summer Headache, Natural Remedies,

24 గంటలు ఏసీలో ఉండటం వల్ల కూడా చాలా మంది తలనొప్పికి గురవుతుంటారు.కాబట్టి రాత్రింబగళ్ళు ఏసీలోనే గడిపేయకుండా బయట స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి.రోజు ఈవినింగ్ వాకింగ్ కి వెళ్ళండి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

నేచురల్ ఎయిర్ మైండ్ ను ప్రశాంతంగా మారుస్తుంది.ఒత్తిడి దూరం చేస్తుంది.

Advertisement

తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.ఇక మండే ఎండ‌ల్లో తిరిగితే త‌ల‌నొప్పి రావ‌డం ఖాయం.

కాబ‌ట్టి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు టోపీ మరియు సన్ గ్లాసెస్ తీసుకోవడం మర్చిపోవద్దు.ఎండ వేడిని నివారించడానికి ఇవి కొంత స‌హాయ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు