ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాట్స్ ముందడుగు ప్రకాశం జిల్లా పల్లెల్లో వాటర్ ట్యాంకుల ఏర్పాటు

ప్రకాశం జిల్లా: ఫిబ్రవరి 3: ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా దృక్పథంతో నాట్స్ ముందడుగు వేసింది.

తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండే ప్రకాశం జిల్లాలోని మారుమూల పల్లెల్లో తాగునీటి కొరతను తీర్చేందుకు తనవంతు సాయంగా వాటర్ ట్యాంకుల నిర్మాణానికి పూనుకుంది.

గత సంవత్సరం పొదిలి మండలం ముగాచింతల గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు సత్ఫలలితాలు ఇవ్వడంతో ఈసారి మరిన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణాన్ని చేపట్టింది.ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఆముదాలపల్లి, కరవది గ్రామాలతో పాటు ఒంగోలు మండలంలో కూడా తాగునీటి ట్యాంకులు, నీటిశుద్ధి కేంద్రాలను గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) సహాకారంతో నిర్మించింది.

వీటిని తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, గ్లో సంస్థ కార్యదర్శి వెంకన్న చౌదరితో కలిసి ప్రారంభించారు.తెలుగునాట మరిన్ని సేవా కార్యక్రమాలు: శ్రీనివాస్ మంచికలపూడి ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడే వాటర్ ట్యాంకులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.భాషే రమ్యం.

సేవే గమ్యం అనే నినాదంతో ఆవిర్భవించిన నాట్స్ తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు.విద్య, వైద్యం, సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించడం వంటి అంశాలపై నాట్స్ ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు.

Advertisement

తెలుగురాష్ట్రాల్లో ఈ అంశాలపై నాట్స్ తనవంతు సాయం చేస్తుందని శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్లో కార్యదర్శి యార్లగడ్డ వెంకన్న చౌదరికి గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గునుపూడి భాస్కర్, కాటూరి పెద్ద బాబు, గోనుగుంట్ల వెంకట్రావు, ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, నరసా రెడ్డి, బలరాం తదితరులతో పాటు గ్రామ సభ్యులు పాల్గొని దాతలని ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు