‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమంలో ఒకపక్క చంద్రబాబునాయుడు గోదావరి జిల్లాలలో మరోపక్క నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మోరంపూడిలో …వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలో మోరంపూడిలో ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమంలో నారా లోకేష్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు.సొంత బాబాయ్ నీ చంపేశావు.
తల్లిని చెల్లిని తరిమేసావు.మరి జనం నిన్ను ఎలా నమ్ముతారు అంటూ లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ పాలన రాష్ట్ర ప్రజల పాలిట కర్మ అని విమర్శించారు.
ఇక ఇదే కార్యక్రమంలో ప్రజా సమస్యలను అర్జీల ద్వారా స్వీకరించారు.
ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగులు మరియు విద్యార్థులు, యువత ఇంకా మహిళలు, రైతులను జగన్ నట్టేట ముంచారని విమర్శించారు.కబ్జాలు, దౌర్జన్యాలు, డబ్బు, అవినీతి నమ్ముకున్న జగన్ రెడ్డిని సాగనంపై సమయం ఆసన్నమైందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలను అన్యాయం చేసి తన కులం మరియు ప్రాంతం ఇంకా మతం వారికే పదవులు కట్టబెడుతున్నారని… లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.జనాలు జగన్ ని సాగనంపటానికి రెడీగా ఉన్నారు.
చంద్రబాబుకి మళ్లీ అధికారం కట్ట పెట్టడానికి ఎదురుచూస్తున్నారు.అంటూ మోరంపూడి లో జరిగిన “ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో లోకేష్ పేర్కొన్నారు.