ఏపీలో టీడీపీ – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ లు ఎక్కువ అవ్వడంతో ఈ రెండు పార్టీల్లో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం లోకి వస్తుంది …? తమకు సీటు వస్తుందా లేదా…? వస్తే ప్రస్తుతం ఉన్న పార్టీలో గెలిచే అవకాశం ఉందా లేదా ఇలా అనేక లెక్కలు వేసుకుంటూ… పార్టీలు ఫిరాయించేవారు ఎక్కువయ్యారు.ఇక ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే… వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ పెరిగిందని… ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… అనేక జాతీయ సంస్థలు తమ సర్వే రిపోర్ట్ ను బయటపెట్టాయి.
దీంతో వైసీపీలో జోష్ పెరిగింది.దీంతో టీడీపీ అలెర్ట్ అయిపోయి అనేక సంక్షేమ పథకాలను హడావుడిగా ప్రకటించి అమలు చేయడం స్టార్ట్ చేసేసింది.దీంతో… మళ్లీ టీడీపీ గాలి ఏపీలో పెరిగినట్టు కనిపించింది.

అయితే ఈ ఎదుగాలిని తట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ టీడీపీలో ఉన్న ఎమ్యెల్యేలను… ఎంపీలను పార్టీలోకి ఆహ్వానించే పనికి శ్రీకారం చుట్టారు.దీంతో ఒక్కసారిగా మళ్లీ వైసీపీ లో సందడి మొదలవ్వగా… టీడీపీలో ఆందోళన కనిపిస్తోంది.అయితే టీడీపీ నుంచి వైసీపీ , వైసీపీ నుంచి టీడీపీ కి నాయకుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
కడప జిల్లాలో టిడిపి నుంచి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కడపకు చెందిన మాజీ మంత్రి ఖలీల్ భాషలు వైసిపిలొ చేరారు.కాంగ్రెస్ నుంచి వైసిపిలొకి మాజీ మంత్రి, సీనియర్ నేత రామచంద్రయ్య చేరారు.
ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా తన కుమారుడితో కలిసి టిడిపిలో చేరారు.అయితే …కొద్ది రోజులుగా వైసిపి నుంచి టిడిపిలో ఎవరూ చేరలేదు.

ఇక కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఈనెల 18న అధికారికంగా తెలుగుదేశంలోకి చేరుతున్పట్టు ప్రచారం జరుగుతోంది.మరోవైపు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి వైసిపిలో చేరారు.అనంతపురం జిల్లాలో ఇటివల సిఐ గోరంట్ల మాధవ్ వైసీపీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు.హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని వైసీపీలో కి చేరారు.అలాగే… రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.అలాగే… కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌లు వైసీపీలో చేరారు.వీరితో తోట మూర్తులు టచ్‌లో ఉన్నారు.
వీటన్నింటినీ బట్టి చూస్తుంటే, కాపు వర్గానికి చెందిన కీలక నేతలపై జగన్ ప్రధానంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.ఆ విధంగా టీడీపీ, పవన్‌లకు చెక్ పెట్టాలని, జగన్ వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నారు.