మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేష్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు

మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించారు.

ఆదివారం ఉద‌యం త‌ల్లి భువ‌నేశ్వ‌రి, భార్య బ్రాహ్మిణి, త‌న‌యుడు దేవాన్ష్‌తో క‌లిసి నారా లోకేష్ మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు.

ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.పండితుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

రాజ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి 20 లక్షల విలువ చేసే బంగారు కిరీటాన్ని సమర్పించారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు