జెర్సీని కొన్న బయ్యర్లు భయంతో కిందా మీద అయ్యేలా చేస్తున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ను చేసింది.

అదే విధంగా శాటిలైట్‌ రైట్స్‌, ఇంకా ఇతర రైట్స్‌ ద్వారా మొత్తంగా నిర్మాతకు 48 కోట్ల వరకు దక్కినట్లుగా తెలుస్తోంది.పాతిక కోట్ల రూపాయలతో రూపొందిన సినిమాకు దాదాపు 50 కోట్ల బిజినెస్‌ అవ్వడంతో సినిమాపై బయ్యర్లు ఎంత నమ్మకంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పొచ్చు.

అయితే తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త బయ్యర్లకు ముచ్చెమటలు పట్టిస్తుంది.జెర్సీ చిత్రంలో నాని క్రికెటర్‌గా కనిపించబోతున్న విషయం తెల్సిందే.

క్రికెట్‌ ఆడుతూ నాని చనిపోయేలా ఈ చిత్రం క్లైమాక్స్‌ ఉంటుందని చెబుతున్నారు.గతంలో నాని నటించిన భీమిలి కబడ్డి జట్టులో కూడా నాని కబడ్డి ప్లేయర్‌గా కనిపించాడు.

Advertisement

ఆ సినిమాలో కూడా నాని కబడ్డి ఆడుతూ చివరకు చనిపోతాడు.ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా కలెక్షన్స్‌ మాత్రం దారుణంగా నమోదు అయ్యాయి.

ఆ సినిమాకు పాజిటివ్‌గా క్లైమాక్స్‌ ఉంటే నాని కెరీర్‌లో అదో బెస్ట్‌ మూవీగా నిలిచేది అనేది అందరి మాట.

తెలుగు ప్రేక్షకులు నెగటివ్‌ క్లైమాక్స్‌ను అస్సలు ఒప్పుకోరు అనే విషయం తెలిసి కూడా ఎందుకు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావడం లేదు.ఇన్ని రోజులు ఆ విషయాన్ని గుట్టుగా ఉంచి సినిమ బిజినెస్‌ అంతా కూడా అయిన తర్వాత మెల్లగా లీక్‌ చేశారు.ముందే ప్రేక్షకులను నాని చనిపోతాడని ప్రిపేర్‌ చేస్తున్నారు.

ఎంత ప్రిపేర్‌ చేసినా కూడా హీరో చనిపోయిన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లో ఓకే చెప్పరు.అందుకే జెర్సీని కొనుగోలు చేసిన బయ్యర్లు భయంతో వణికి పోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు