నాని దసరా.. సిల్క్ స్మిత పోస్టర్ పై ఆడియెన్స్ ఆసక్తి..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో దసరా అనే సినిమా వస్తుంది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ మూవీగా ఈ ప్రాజెక్ట్ నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది.ఈ సినిమాలో నాని లుక్, యాటిట్యూడ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని అంటున్నారు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.2023 మార్చి 30న దసరా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాతో నాని కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ లో హీరో నాని వెనక సిల్క్ స్మిత ఫోటోని పెట్టారు.పోస్టర్ లో నాని కన్నా ఆమె హైలెట్ అయ్యిందని చెప్పొచ్చు.ఇంతకీ నాని దసరాకి సిల్క్ స్మితకి సంబంధం ఏంటి.90వ దశకంలో జరుగుతున్న కథ అని చెప్పేందుకే సిల్క్ స్మిత ఫోటో పెట్టారా లేక ఆమెకి ఈ సినిమాకి ఏదైనా సంబంధం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.ఈ సినిమాతో నాని మాత్రం నేషనల్ లెవల్ లో తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు