యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన 'అంటే సుందరానికి'!

నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా ఇచ్చిన విజయం తర్వాత నాని అంటే సుందరానికి సినిమా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి చేసాడు.

ఈ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది.రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై మరింత హైప్ పెంచేశారు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.ఇది బాగా ఆకట్టు కుంది.

Advertisement

ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సినిమా నాని నుండి మరొకటి రాబోతుంది అని ఫ్యాన్స్ అంతా సంతోషంగా ఉన్నారు.ఇక ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అవ్వనుంది.

ఇందులో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించింది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు.

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.ఈ సినిమాలో నాని డిఫెరెంట్ పాత్రలో నటించాడు.ఇక ఇప్పటికే యుఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడిపోయాయి.

మరి ముందు నుండి పాజిటివ్ బజ్ ఏర్పడడం వల్ల యుఎస్ లో ఈ సినిమా మంచి స్టార్టింగ్ తో స్టార్ట్ అయ్యింది.యుఎస్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 2 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టింది అనే చెప్పాలి.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మరి పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.చూడాలి మరి నాని అంటే సుందరానికి సినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో.

Advertisement

తాజా వార్తలు